Astrology Monthly Horoscope Details

Notifications

కన్య కన్య
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లావాదేవీలు ఫలిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. తరచు సన్నిహితులతో సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వాహనం అమర్చుకోవాలనే కోరిక తీరుతుంది. కీలక పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగేయాలి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. వివాస్పద విషయాల్లో జోక్యం తగదు. వాయిదా పడుతూ వస్తున్న మొక్కులు తీర్చుకుంటారు.

Thunderstorm : ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు

14-06-2016 ఆదివారం ఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త..

14-06-2026 నుంచి 20-06-2026 వరకు వార ఫలితాలు

14-06-2026 నుంచి 20-06-2026 వరకు వార ఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ వారం కొంతమేరకు అనుకూలం. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాల పట్ల దృష్టి సారిస్తారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు సానుకూలమవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు తగిన సమయం కాదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం, అధికారులకు వీడ్కోలు పలుకుతారు.