Astrology Weekly Horoscope Details

Notifications

సింహం సింహం
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం అన్ని విధాలా యోగదాయకం. మీ మాటకు తగిన ప్రాధాన్యం లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆలయాలను విరాళాలు అందిస్తారు. శుక్రవారం నాడు ఆచితూచి అడుగు వేయాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కొత్తయత్నాలు చేపడతారు. కీలక పత్రాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగావకాశం లభిస్తుంది. ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన బదిలీ. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణం

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణందేశ ఆర్థిక రాజధాని ముంబైలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా నగరంలో కోవిడ్-19, స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1), ఇన్‌ఫ్లుయెంజా వంటి ప్రమాదకర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల రాకతో నిండిపోతున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, ఎడతెరిపి లేని దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో వందలాది మంది ప్రజలు ప్రతిరోజూ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. గత నెల రోజులుగా స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవగా, గత వారం రోజులుగా కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా మళ్లీ పెరుగుతున్నాయని ముంబై వైద్యులు వెల్లడించారు.

సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో లీకైన అమ్మోనియా.. 67మంది కార్మికులకు ఏమైంది?

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదుమేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధి, వ్యవహారానుకూలత ఉన్నాయి. మాట నిలబెట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్ మధ్యవర్తులతో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. శుక్రవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ముఖ్యం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం.

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?