Astrology Weekly Horoscope Details

Notifications

తుల తుల
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు లక్ష్యానికి చేరువలో ఉన్నారు. పట్టుదలతో యత్నాలు సాగించండి, సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కొందరి నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గురువారం నాడు ఆచితూచి అడుగేయాలి. అందరితోను మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వారున్నారు జాగ్రత్త, దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. అస్వస్థతకు గురవుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు నిరుత్సాహకరం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు చేపడతారు.

NEET పరీక్ష: Fathers Day నాడు కుమార్తె కోసం పోలీసు కాళ్లు పట్టుకున్న తండ్రి, వీడియో

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణం

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణందేశ ఆర్థిక రాజధాని ముంబైలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా నగరంలో కోవిడ్-19, స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1), ఇన్‌ఫ్లుయెంజా వంటి ప్రమాదకర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల రాకతో నిండిపోతున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, ఎడతెరిపి లేని దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో వందలాది మంది ప్రజలు ప్రతిరోజూ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. గత నెల రోజులుగా స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవగా, గత వారం రోజులుగా కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా మళ్లీ పెరుగుతున్నాయని ముంబై వైద్యులు వెల్లడించారు.

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదుమేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధి, వ్యవహారానుకూలత ఉన్నాయి. మాట నిలబెట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్ మధ్యవర్తులతో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. శుక్రవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ముఖ్యం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం.

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?