Astrology Weekly Horoscope Details

Notifications

వృశ్చికం వృశ్చికం
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు అనుకూలతలు అంతంతమాత్రమే. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శనివారం నాడు పనుల ప్రారంభానికి ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతుల మధ్య అకారణ కలహం, సౌమ్యంగా మెలగండి. అప్పులు తగ్గించుకుంటారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు ఇస్తాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిరువ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి, వివాదాలు పరిష్కారమవుతాయి.

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణం

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణందేశ ఆర్థిక రాజధాని ముంబైలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా నగరంలో కోవిడ్-19, స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1), ఇన్‌ఫ్లుయెంజా వంటి ప్రమాదకర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల రాకతో నిండిపోతున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, ఎడతెరిపి లేని దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో వందలాది మంది ప్రజలు ప్రతిరోజూ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. గత నెల రోజులుగా స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవగా, గత వారం రోజులుగా కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా మళ్లీ పెరుగుతున్నాయని ముంబై వైద్యులు వెల్లడించారు.

సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో లీకైన అమ్మోనియా.. 67మంది కార్మికులకు ఏమైంది?

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదుమేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధి, వ్యవహారానుకూలత ఉన్నాయి. మాట నిలబెట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్ మధ్యవర్తులతో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. శుక్రవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ముఖ్యం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం.

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?