Astrology Weekly Horoscope Details

Notifications

ధనస్సు ధనస్సు
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం పరిస్థితులు, చక్కబడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. స్నేహసంబంధాలు బలపడతాయి. మాటతీరుతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. ఖర్చులు అధికం ప్రయోజనకరం. పొదుపు ధనం గ్రహిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అయిన వారితో సంతోషంగా కాలం గడుపుతారు. ఉపాధ్యాయులకు స్థానచలనం, ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదానూర్పు, వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నూతన వ్యాపారాలు కలిగిరావు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.

ఆ బిడ్డ నాకు పుట్టలేదు.. రెండు నెలల పసికందును చంపేసిన తండ్రి

ఆ బిడ్డ నాకు పుట్టలేదు.. రెండు నెలల పసికందును చంపేసిన తండ్రినిజామాబాద్‌‌లో ఘోరం జరిగింది. నిజామాబాద్‌, అశోక్ నగర్‌లో రెండు నెలల కుమారుడు ప్రేమ్‌ను తనకు పుట్టలేదనే అనుమానంతో తండ్రి యువరాజ్ కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశాడు. భార్య ప్రియాంక ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నయాగావ్‌కు చెందిన యువరాజ్‌, నిజామాబాద్‌లోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన ప్రియాంక ఏడాది కిందట వివాహం చేసుకున్నారు. కొన్ని నెలలపాటు వారి బంధం అన్యోన్యంగా సాగింది. ఆ తర్వాత ప్రియాంకపై యువరాజ్ అనుమానం పెంచుకోవడం ప్రారంభించాడు.

తెలంగాణకు వస్తాం, తిరుగుతాం, పోటీ చేస్తాం, తెలంగాణలో పవన్ జనసేన జెండా, వీడియో

తెలంగాణకు వస్తాం, తిరుగుతాం, పోటీ చేస్తాం, తెలంగాణలో పవన్ జనసేన జెండా, వీడియోతెలంగాణ రాష్ట్రంలో జనసేన నూతన కార్యాలయంలో జనసేన జెండాను ఎగురవేసారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణలో మీకేం పని అంటూ ఆమధ్య తెలంగాణకి చెందిన కొంతమంది నాయకులు చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పవన్ కల్యాణ్ గట్టి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. మేము తెలంగాణకు వస్తాం, తిరుగుతాం, ఎన్నికల్లో పోటీ చేస్తాము. సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు అండగా వుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు. హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు తెలంగాణ జనసేన నాయకులు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, జనసైనికులు, వీరమహిళల సమక్షంలో ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా కార్యాలయ ప్రవేశం జరిగింది.

19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

Guru Pushya Yog 2026: గురు పుష్య యోగం.. కర్కాటక రాశికి లాభం... పూజ ఎలా చేయాలంటే?