Astrology Yearly Horoscope Details

Notifications

మకరం మకరం
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం 1,2, 3, 4, ధనిష్ట 1, 2 పాదములు ఆదాయం - 2 వ్యయం 8, రాజపూజ్యం - 1 అవమానం - 6 ఈ రాశివారి గోచారం పరిశీలించగా అన్ని రంగాల వారికీ ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. వ్యవహారానుకూలత, కార్యసిద్ధి ఉన్నాయి. లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు అధికం. ఇతరుల కోసం ధనం విపరీతంగా ఖర్చుచేస్తారు. పొదుపు మూలక ధనం అందుకుంటారు. పెట్టుబడులు కలిసిరావు. మీ శ్రీమతి లేక శ్రీవారి బంధువర్గంతో సంబంధాలు బలపడతాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆసక్తి కలిగించిన సంబంధం నిశ్చయమవుతుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. దంపతుల మధ్య అప్పుడప్పుడు కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోగలవు. ఆత్మీయులతో తరచుగా కాలక్షేపం చేస్తారు. సొంతంగా గృహం అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. అందుకు తగ్గట్టుగా యత్నాలు సాగిస్తారు. బ్యాంకు, ఇతరత్రా రుణాలు మంజూరవుతాయి. మీ సిఫార్సుతో ఒకరికిఉద్యోగావకాశం లభిస్తుంది. చిన్ననాటి గురువులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. విద్యార్థులకు చదువులపై శ్రద్ధలోపిస్తుంది. ఇతర వ్యాపకాలతో కాలం గడుపుతారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటం కష్టమే. ఏకాగ్రతతో శ్రమిస్తే మంచి ఫలితాలు, ర్యాంకులు సాధించగల్గుతారు. వీరికి ఇంజనీరింగ్, మెడికల్, లా కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. నగదు బహమతి, ప్రమోషన్లు పొందుతారు. అధికారులు సైతం వీరి ఉన్నతికి సహకరిస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. అనుక్షణం యాజమానుల కోపతాపాలకు గురవుతుంటారు. ఈ సంవత్సరం చివరిలో వీరికి స్థానమార్పు, ప్రోత్సాహకరమైన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వీరి ప్రతిభకు తగిన అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. వ్యవసాయ రంగాల వారికి మొదటి పంట కంటే రెండవ పంట అధిక దిగుబడి ఇస్తుంది. పంటలకు తగిన మద్దతు ధర కూడా లభిస్తుంది. దళారుల వలలో పడకుండా కొంత ఆలస్యంగానైనా మంచి ధర కోసం వేచియుండటం శ్రేయస్కరం. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా బాగుంటుంది. నూతన ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ ప్రోత్సాహం. సత్వరం రుణాలు మంజూరవుతాయి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. అప్పుడప్పుడు స్వల్ప రుగ్మతలకు గురైనా వెంటనే తగ్గిపోగలవు. ఈ రాశివారు తరుచు వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. వీరి ఇంట శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడటంతో పాటు సోదర వర్గం బంధువులతో విభేదాలు సమసిపోగలవు. యోగ, ధార్మికతల పట్ల ఆసక్తి చూపుతారు. పుణ్యక్షేత్ర సందర్శనలు, పుణ్యనదీ స్నానాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది.

తన తప్పునకు మూల్యం చెల్లించుకుంటున్నా : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

తన తప్పునకు మూల్యం చెల్లించుకుంటున్నా : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతన తప్పునుకు మూల్యం చెల్లించుకుంటున్నట్టు కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ముంబై నగర రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ కష్టాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముంబైయిలో ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శనివారం నిర్వహించిన 22వ ఇండో-అమెరికన్ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సమావేశానికి గంట ఆలస్యంగా వచ్చినందుకు అక్కడి వారికి క్షమాపణలు చెప్పారు. తాము ముందుగానే బయల్దేరినప్పటికీ.. ట్రాఫిక్‌ సమస్యల వల్ల ఆలస్యమయ్యిందన్నారు. తన తప్పునకు మూల్యం చెల్లించుకుంటున్నానని పేర్కొనడంతో కార్యక్రమంలో నవ్వులు విరిశాయి.

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు చేపడతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. శనివారం నాడు అందరితో మితంగా సంభాషించండి. ఎదుటివారు మీ వ్యాఖ్యలను తప్పుపట్టే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిరువ్యాపారులకు సామాన్యం. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?సెప్టెంబర్ 15 నుండి 23 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతుండగా, వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఉత్సవం తొమ్మిది రోజుల పాటు సాగుతుంది. నేడు మనం చూస్తున్న ఊరేగింపులు, వాహన సేవలు, ఆచారాలు, వివిధ కాలాల్లోని పాలకులు, ఆలయ నిర్వాహకులు, భక్తుల ద్వారా శతాబ్దాలుగా జరిగిన మార్పులు, చేర్పుల ఫలితమే. పురాణాల ప్రకారం, శ్రీనివాస స్వామి వెంకటాచలంపై ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా నిర్వహించారు. అందుకే దీనికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది. అయితే, ఈ ఉత్సవం శతాబ్దాల కాలక్రమంలో పరిణామం చెందిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

జీవితంలో పైకి ఎదగటానికి, నాశనం కావడానికి ఆ రెండే మార్గాలు, శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాలు