Astrology Yearly Horoscope Details

Notifications

మీనం మీనం
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర 1 2 3 4 పాదములు, రేవతి-1 2 3 4 పాదములు ఆదాయం -14 వ్యయం-11 - రాజపూజ్యం - 7 అవమానం 2 ఈ రాశివారికి ఈ సంవత్సరం అన్ని విధాలా శుభదాయకమే. సంకల్పసిద్ధితో అనుకున్నది సాధిస్తారు. పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు, బంధువర్గం వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలకు మాత్రం పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. విలాసాలకు అతిగా వ్యయం చేస్తారు. అవసరాలకు ఏదో విధంగా ధనం సమకూరుతుంది. ప్రతి విషయంలోను చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గృహంలో శుభకార్యాలు, వేడుకలు ఉంటాయి. బంధువర్గం వారు మరింత చేరువవుతారు. దంపతుల మధ్య స్వల్ప కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోగలవు. మీ ఓర్పు, అంకితభావం శ్రీరామరక్షగా నిలుస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఔషధసేవనం, ఆహార నియమాల్లో క్రమం తప్పవద్దు. అప్పుడప్పుడు స్వల్ప అస్వస్థతకు గురవుతుంటారు. తరచు వైద్యపరీక్షలు చేయించుకోవటం శ్రేయస్కరం. ఈ సంవత్సరంలో స్థిరాస్తి కొనుగోళ్లు, వ్యవహారానుకూలతలు, కార్యసిద్ధి, దైవబలం తోడ్పాటు, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మీ నిర్లక్ష్యం వల్ల గృహంలో చోరీలు జరిగే ఆస్కారం ఉంది. నగదు, వెండి బంగారాలు జాగ్రత్త. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. శుభకార్యాలు, బంధమిత్రుల రాకపోకలతో గృహం నిత్యం సందడిగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం విశేష ఫలితాలున్నాయి. సమర్ధతకు గుర్తింపు, అధికారులు మెచ్చుకోవటాలు, నగదు బహుమతులు, స్థానచలనంతో కూడిన పదోన్నతి పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. కష్టమనుకున్న కేసులు సైతం సునాయాసంగా గెలుస్తారు. సంఘంలో పేరుప్రతిష్టలు లభిస్తాయి. వ్యవసాయదారులకు యోగదాయకమే. సకాలంలో పంట రుణాలు చేతికందుతాయి. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. ఆశించిన మద్దతు ధర లభిస్తుంది. మెట్ట రైతులకు మాత్రం నిరాశాజనకం. సకాలంలో వర్షాలు కురవక పంట దిగుబడి అనుకున్నంత రాకపోవచ్చు. దళారులు, మార్కెటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు శుభ తరుణం. నూతన వ్యాపారాలు చేపడతారు. బ్యాంకు, ఫైనాన్సు సంస్థల రుణాలు మంజూరవుతాయి. ఆకర్షణీయమైన పథకాలతో విక్రయాలు బాగుంటాయి. ముఖ్యంగా పట్టు, చేనేత, కలంకారీ వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విద్యార్థులకు గురు ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు, ఆశించిన ర్యాంకులు సాధించగల్గుతారు. వీరికి విదేశాల్లో అవకాశాలు రావటంతో పాటు దూరప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఈ రాశి స్త్రీలకు మహోన్నత కాలం. అన్ని రంగాల్లోను వీరు రాణిస్తారు. వీరి మాటకు విలువ పెరగటంతో పాటు సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. మొత్తం మ్మీద ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం సర్వత్రా యోగకాలం, శుభప్రదమని చెప్పవచ్చు.

తన తప్పునకు మూల్యం చెల్లించుకుంటున్నా : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

తన తప్పునకు మూల్యం చెల్లించుకుంటున్నా : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతన తప్పునుకు మూల్యం చెల్లించుకుంటున్నట్టు కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ముంబై నగర రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ కష్టాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముంబైయిలో ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శనివారం నిర్వహించిన 22వ ఇండో-అమెరికన్ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సమావేశానికి గంట ఆలస్యంగా వచ్చినందుకు అక్కడి వారికి క్షమాపణలు చెప్పారు. తాము ముందుగానే బయల్దేరినప్పటికీ.. ట్రాఫిక్‌ సమస్యల వల్ల ఆలస్యమయ్యిందన్నారు. తన తప్పునకు మూల్యం చెల్లించుకుంటున్నానని పేర్కొనడంతో కార్యక్రమంలో నవ్వులు విరిశాయి.

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు చేపడతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. శనివారం నాడు అందరితో మితంగా సంభాషించండి. ఎదుటివారు మీ వ్యాఖ్యలను తప్పుపట్టే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిరువ్యాపారులకు సామాన్యం. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?సెప్టెంబర్ 15 నుండి 23 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతుండగా, వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఉత్సవం తొమ్మిది రోజుల పాటు సాగుతుంది. నేడు మనం చూస్తున్న ఊరేగింపులు, వాహన సేవలు, ఆచారాలు, వివిధ కాలాల్లోని పాలకులు, ఆలయ నిర్వాహకులు, భక్తుల ద్వారా శతాబ్దాలుగా జరిగిన మార్పులు, చేర్పుల ఫలితమే. పురాణాల ప్రకారం, శ్రీనివాస స్వామి వెంకటాచలంపై ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా నిర్వహించారు. అందుకే దీనికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది. అయితే, ఈ ఉత్సవం శతాబ్దాల కాలక్రమంలో పరిణామం చెందిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

జీవితంలో పైకి ఎదగటానికి, నాశనం కావడానికి ఆ రెండే మార్గాలు, శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాలు