Astrology Yearly Horoscope Details

Notifications

మిథునం మిథునం
పరాభవ నామ సంవత్సర ఫలితాలు 2026 నుంచి 2027 వరకు ఆదాయం - 8 వ్యయం-11 రాజపూజ్యం-7 అవమానం-1 మిథునరాశి : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 1 2 3 4 పాదములు పునర్వసు 1, 2, 3 పాదములు ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్నింట అపజయం పొందినా మరికొన్నింట మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవహారానుకూలతలు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కీలక బాధ్యతలు, పనులు స్వయంగా చూసుకోవాలి. నిరంతరం శ్రమిస్తుంటారు. ఫలితాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. మీ శ్రీమతి బంధువర్గం వారితో విభేదాలు తలెత్తుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. సంస్థల స్థాపనలు, గృహనిర్మాణాలకు అనుమతులు మంజూరవుతాయి. అనుక్షణం సంతానం భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. సంతానానికి మంచి ఫలితాలున్నాయి. అవివాహితులకు వివాహయోగం. ప్రముఖులతో పరిచయాలు, సోదర వర్గం వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్యాల పట్ల యత్నాలు సాగిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తి కాగలవు. లైసెన్సులు, పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం సమస్యాత్మకమవుతుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యవసాయపరంగా అకాల వర్షాలు, వరదలు, తుఫానుల వల్ల పంటదిగుబడులు తగ్గుతాయి. మద్దతు ధర లభించటం కష్టమవుతుంది. దళారుల వల్ల మోసపోతారు. వ్యాపారపరంగా హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. చిరువ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస, సమయపాలన ప్రధానం. పదోన్నతికి అవకాశం లేదు. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. ధనప్రలోభాలకు పోవద్దు. కిట్టని వ్యక్తుల వల్ల కొత్త ఇబ్బందులెదరవుతాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం, బాధ్యతల మార్పు. వీరి పదోన్నతి విద్యార్థుల ఉత్తీర్ణతపై ఆధారపడి ఉంటుంది. విద్యార్థులు ఏకాగ్రతతో శ్రమిస్తే అనుకున్న మంచి ర్యాంకులు సాధిస్తారు. సహవిద్యార్థులతో స్నేహంగా మెలిగితే మంచి ఫలితాలుంటాయి. వీరికి విదేశీ విద్యావకాశం లభించే అవకాశం లేదు. అయినప్పటికీ కోరుకున్న విద్యావకావం లభిస్తుంది. ఈ రాశివారికి ద్వితీయార్ధం అనుకూలంగా ఉంటుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకోగలుగుతారు. కొత్త రుణాలు మంజూరవుతాయి. గృహనిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. తరచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. అందరితోను కలుపుగోలుగా మెలిగి అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అలక్ష్యం తగదు. వైద్యసేవలు అవసరమవుతాయి. అప్రియమైన వార్తలు వింటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. తోటి ప్రయాణీకులతో మితంగా సంభాషించండి. విదేశీ సందర్శనలకు పాస్ పోర్టు, వీసాలు మంజూరవుతాయి. కళా, క్రీడా పోటీల్లో రాణిస్తారు. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది.

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు చేపడతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. శనివారం నాడు అందరితో మితంగా సంభాషించండి. ఎదుటివారు మీ వ్యాఖ్యలను తప్పుపట్టే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిరువ్యాపారులకు సామాన్యం. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?సెప్టెంబర్ 15 నుండి 23 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతుండగా, వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఉత్సవం తొమ్మిది రోజుల పాటు సాగుతుంది. నేడు మనం చూస్తున్న ఊరేగింపులు, వాహన సేవలు, ఆచారాలు, వివిధ కాలాల్లోని పాలకులు, ఆలయ నిర్వాహకులు, భక్తుల ద్వారా శతాబ్దాలుగా జరిగిన మార్పులు, చేర్పుల ఫలితమే. పురాణాల ప్రకారం, శ్రీనివాస స్వామి వెంకటాచలంపై ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా నిర్వహించారు. అందుకే దీనికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది. అయితే, ఈ ఉత్సవం శతాబ్దాల కాలక్రమంలో పరిణామం చెందిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

జీవితంలో పైకి ఎదగటానికి, నాశనం కావడానికి ఆ రెండే మార్గాలు, శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాలు