సంబంధిత వార్తలు
- రాజన్న రాజ్యం అంటే.. రైతులపై లాఠీ విరగడమేనా? నారా లోకేశ్
- ఓర్నీ... ఆంధ్రోళ్లను అరెస్టు చేస్తారా? ఏంది?
- పప్పుబాబుకు ఉన్న చిటికెడు మెదడు చిట్లిపోయినట్టుంది : విజయసాయి రెడ్డి
- నడిరోడ్డుపై నరికేస్తా... ఎమ్మెల్యే వార్నింగ్, లోకేష్ ట్వీట్, ట్విట్టర్ బాంబర్ అంటూ...
- కరెంట్ కోతలు లేకుండా చూడండి సీఎంగారూ... లేదంటే జనాలు మీ నాయకుల్ని తంతారు
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం వెలగబెడుతున్నది వైకాపానా? తెదేపానా? : లోకేశ్
ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి వైఖరి ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. రైతులకు విత్తనాలు అందక పడుతున్న అవస్థలపై ఆయన ఓ ట్వీట్ చేశారు.
వైకాపా అధికారంలో ఉందని మరిచిపోయారా? విత్తనాలో జగన్ ప్రభో అంటూ రైతులు గగ్గోలు పెడుతుంటే.. చంద్రబాబు వల్లే విత్తనాలు ఇవ్వలేకపోతున్నామంటున్నారు.
ఒకటో తారీఖుకొచ్చే పింఛను రాలేదేమని పండుటాకులు నిలదీస్తే! గత ప్రభుత్వం వల్లే ఆలస్యమైందని సమాధానం ఇస్తున్నారు. బీమా రాలేదు.. మా బతుకుల ధీమా ఏదీ అంటే! తెలుగుదేశం సర్కారు వల్లే అంటూ మాట దాటవేస్తున్నారు.
నేను విన్నాను.. నేను ఉన్నానంటూ సీఎం అయ్యి, పాలన చేతకాక.. ఇప్పుడు చంద్రబాబే వింటాడు.. చంద్రబాబే ఉంటాడు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం వెలగబెడుతున్నది వైకాపానా? తెదేపానా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం సంధించారు.
