1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 05-09-2026 Daily Astrology

05-09-2026 శనివారం దినఫలాలు - ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టండి...

Daily Astrology
మేషం: అశ్వని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం.
ఉద్యోగ రంగంలో మీరు చేపట్టిన పనులు అనుకున్న విధంగా ముందుకుసాగి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నప్పటికీ అనవసర ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది.
 
వృషభం : కృత్తిక 2,3,4 పాదాలు రోహిణి ముగశిర 1,2 పాదాలు.
అవకాశాలు రావడంతో మీ కార్యకలాపాలను విస్తరించే ఆలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తాయి.
 
మిథునం : మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు.
ఉద్యోగంలో పనిభారం పెరిగినా మీ సమర్థతతో బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ ఇతరులకు హామీలు ఇవ్వడంలో జాగ్రత్త అవసరం.
 
కర్నాటకం : పునర్వసు 4వ పాదం పుష్యమి, ఆశ్లేష
బంధించిన ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమై మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణం చేయాల్సి వస్తే ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం వల్ల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయి.
 
సింహం : ముఖ, సుబ్బ, ఉత్తర 1వ పాదం.
వ్యాపారంలో మీరు చేసిన ప్రయత్నాలకు మంచి స్పందన లభించి కొత్త లాభదాయక అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు రావడంతో. బాధ్యతలు మరింత పెరిగి అవకాశం ఉంది.
 
కన్య : ఉత్తర 2,3,4 పాదాలు హస్త చిత్త 1,2 పాదాలు,
పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యంలో స్వల్ప అలసట కనిపించే అవకాశం ఉన్నందున విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి.
 
తుల : చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు.
కొత్త పరిచయాల ద్వారా వ్యక్తిపరమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరగడంతో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనురాధ. జేృష్ణ 1,2,3,4 పాదాలు.
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు కంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత పాటిస్తే అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు.
 
ధనుస్సు : మూల పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు, ఉత్తరషాడ 1వ పాదం
ఉద్యోగంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చి భవిష్యత్ అభివృద్ధికి మార్గం చూపుతాయి. దూర ప్రయాణం లేదా ముఖ్యమైన సమావేశం ద్వారా ఉపయోగకరమైన పరిచయం ఏర్పడుతుంది.
 
మకరం : ఉత్తరషాడ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు.
గతంలో చేసిన కృషికి తగిన ఫలితం లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ అవసరాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తవుతుంది.
 
కుంభం : ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం పూర్వభాద్ర 1,2,3 పాదాలు.
కొత్త ఆలోచన కార్యరూపం ఇవ్వడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. స్నేహితులు లేదా సహచరుల సహకారంతో మీరు ఊహించిన పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు.
 
మీనం : పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి.
కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందగలుగుతారు. 
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియో