ఆస్తి కోసం తమ్ముడి భార్యను చంపేశారు - ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఆస్తి కోసం సోదరుడి భార్యను అన్నలు చంపేశారు. ఈ ఘాతుకం జిల్లాలోని కోయిల్‌కొండ మండలం, చింతల్ తండాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
చింతల్ తండాకు చెందిన బలరామ్‌కు సునీత (28)తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బలరామ్‌కు మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో, ఏడాది క్రితం పంచాయితీ ద్వారా ఒక ఎకరం భూమిని సునీత పేరు మీద రిజిస్టర్ చేయించారు.
ఇది నచ్చని బలరామ్ సోదరులు పాండునాయక్, మాన్యానాయక్ ఆ భూమిని ఎలాగైనా తమ ఆధీనంలోకి తీసుకోవాలని భావించారు. ఈ క్రమంలో వారు భార్యాభర్తలను కలిసి ఉండనివ్వకుండా, తరచుగా బలరామ్‌ను తమతో పాటు హైదరాబాద్‌కు తీసుకెళ్లేవారు. దీనితో విసిగిపోయిన సునీత తన పుట్టింటికి వెళ్లిపోయింది.
తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి, నెల రోజుల క్రితం చింతల్ తండాలోనే ఒక ఇల్లు కట్టించి ఇచ్చారు. అప్పటి నుండి ఆమె అక్కడే నివసిస్తోంది. బలరామ్ సోదరులు ఆమె ఇంటికి వెళ్లి, ఆ భూమిని తమకు ఇచ్చేయాలని, లేదంటే ఇల్లు ఖాళీ చేయాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించారు.
నవంబరు 2వ తేదీన మధ్యాహ్నం సమయంలో, ఆ ఇద్దరు సోదరులు, పాండు భార్య పార్వతి, వారి బంధువు మాణిక్యనాయక్ కలిసి సునీతను హత్య చేశారు. వారు ఆమె మెడకు టవల్ చుట్టి, తమ ఇంటికి ఈడ్చుకెళ్లి, కత్తులతో గొంతు కోసి అత్యంత క్రూరంగా చంపేశారు.
ఈ హత్య జరుగుతున్న సమయంలో సునీత భర్త బలరామ్ హైదరాబాద్‌లో ఉన్నాడు. సునీత తండ్రి వల్యనాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరాలీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

