శ్రీశైలం జలాశయానికి భారీగా నీటి ప్రవాహం - 863.90 అడుగులకు చేరిన నీటి మట్టం
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుండి జలాశయానికి 2.45 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 863.90 అడుగులకు చేరింది.
జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 118.6216 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు, అధికారులు ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.
విద్యుత్ ఉత్పత్తి అనంతరం, 4,267 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. అదనంగా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు.
