1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Telugu Funny Jokes

నీ గండం నుండి గట్టెక్కేశాడు.. కాని అది నాకు చుట్టుకుంది

Telugu Funny Jokes
భార్య- ఏవండీ నేను మీ దగ్గరకు రాగానే మీరు కళ్లజోడు పెట్టుకుంటారు ఎందుకు? 
భర్త- నీకు తలనొప్పి ఎప్పుడు వస్తే అప్పుడు కళ్లజోడు పెట్టుకోమని కళ్ల డాక్టర్ చెప్పాడు..
 
2.
టీచర్- ఒరేయ్...బంటి.. శబ్ద కాలుష్యం నివారించాలంటే ఏం చెయ్యాలిరా.
స్టూడెంట్- చాలా సింపుల్ టీచర్... మన చెవులు మూసుకోవాలి.
 
3. 
భార్య- ఏమండోయ్.. పూజలో పాల్గొంటే గండాల నుండి గట్టెక్కుతారట.
భర్త- ఔను నిజమే... మీ నాన్న ఎన్ని పూజలు చేశాడో... నీ గండం నుండి గట్టెక్కేశాడు.. కాని అది నాకు చుట్టుకుంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
బిగ్ బాస్ హౌజ్‌లో బాహుబలి స్కిట్.. హేమసేన అనగానే నవ్వులు.. శ్రీముఖి అసహనం?