పీకల వరకు మద్యం సేవించిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్కూలుకు వచ్చాడు. మద్యం మత్తులో తన కుర్చీలో కుదురుగా కూర్చోవాల్సింది పోయి తరగతికి వచ్చి తను డ్యాన్స్ చేస్తూ బాలికలతో డ్యాన్స్ చేయించాడు. అంతేనా.. ఆ డ్యాన్సులను వీడియో తీసి సోషల్ మీడియాల పోస్ట్ చేశాడు. అవి కాస్త వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్లోని దామో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.