Pawan Kalyan, తీవ్రమైన జ్వరం, మళ్లీ భుజం నొప్పి వచ్చిందా, హుటాహుటిన హైదరాబాద్‌కి పవన్
శనివారం నాడు కాకినాడలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంతో హుషారుగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ తర్వాత కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. రాజమండ్రిలో ఆయనను వైద్యులు పరీక్షించారు. ఆ ఫలితాలను పరీశిలించిన అనంతరం మెరుగైన చికిత్స, విశ్రాంతి కోసం డిప్యూటీ సీఎం హైదరాబాదుకి బయలుదేరి వెళ్లారు.
కాగా ఇటీవలే ఆయన తన భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. భుజానికి కట్టుతోనే ఆయన విధుల్లో పాల్గొన్నారు.
అల్ప వర్షపాతం: తిరుమలలో వరుణ యాగం ఎందుకు జరపలేదంటే?
అల్పవర్షపాతం కారణంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఆలయాలు ఇప్పటికే వరుణ యాగాలను నిర్వహించాయి. ఇంకా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. గతంలో వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వరుణ యాగాలను నిర్వహించినప్పటికీ, ఇప్పుడు మాత్రం తిరుమలలో అటువంటి కార్యక్రమాన్ని ఎందుకు ప్రకటించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
20 ఏళ్ల యువకుడితో అఫైర్.. భర్తకు నిద్రమాత్రలు.. అక్కడ కరెంట్ షాకిచ్చి..?
భర్తను హత్య చేస్తున్న భార్యల సంఖ్య పెరిగిపోతుంది. వివాహేతర సంబంధాలు నేరాల సంఖ్యను పెంచేస్తుంది. తాజాగా ఢిల్లీలో ఖర్చులకు భర్త డబ్బులు ఇవ్వడం లేదన్న కక్షతో 55 ఏళ్ల భర్తను మట్టుబెట్టాలని పథకం వేసింది ఓ భార్య. అలాగే 45 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది.
ఈ సంబంధానికి అడ్డున్న భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. అంతే రాత్రి వేళ భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ తప్పేలా చేసింది. ఆ తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిపించి, అత్యంత క్రూరంగా భర్త ప్రైవేట్ పార్ట్‌కు కరెంట్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీసింది. ఆపై ఇంట్లో దొంగలు పడి భర్తను చంపారని డ్రామా చేసింది.
VISA - వింటారా సరదాగా’ రెండో టీజర్ విడుదల
‘VISA - వింటారా సరదాగా’ చిత్రానికి సంబంధించిన రెండో టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. ఉద్భవ్ రఘు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న ఈ క్విర్కీ క్యాంపస్ టు USA రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ ఎస్. మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తుండగా.. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
iPhone 17 Pro Max : ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కాస్మిక్ ఆరెంజ్ రంగుపై భారీ తగ్గింపు
ఫ్లిఫ్ కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై తగ్గింపును అందిస్తోంది. దీనివల్ల కొనుగోలుదారులు 256జీబీ మోడల్‌ను దాని ప్రారంభ ధర కంటే తక్కువకే పొందవచ్చు. కాస్మిక్ ఆరెంజ్ రంగు వేరియంట్ ధర ఇప్పుడు రూ.1,49,900 నుండి రూ.1,41,900కి తగ్గింది. అంటే ప్లాట్‌ఫారమ్ నుండి నేరుగా రూ.8,000 తగ్గింపు లభిస్తోంది.
ఇప్పటికే ఐఫోన్ వాడుతున్నట్లయితే, ఈ డీల్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ఐఫోన్ 16ను ఎక్స్ఛేంజ్ చేస్తే ఫ్లిఫ్ కార్ట్ రూ.35,600 వరకు ఆఫర్ అందిస్తోంది. దీనికి ఇప్పటికే ఉన్న తగ్గింపును జోడిస్తే, 256జీబీ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ.98,300కి తగ్గుతుంది. ఇది ప్రారంభ ధరతో పోలిస్తే గణనీయమైన తగ్గింపు.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?









