ఏపీ నుంచి ఆర్ఆర్ఆర్.. ఆ జాబితాలో అగ్రస్థానం.. పక్కాగా పనిచేశారు..  
                                       
                  
                  				  2024 ఎన్నికల్లో TDP కూటమి ఏపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తమ పనితీరు కనబరిచిన ఎంపీని గురించి తెలుసుకుందాం. హాజరు శాతం, లేవనెత్తిన ప్రశ్నలపై సేకరించిన డేటా ఆధారంగా, రఘు రామ కృష్ణంరాజు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. 
				  											
																													
									  
	 
	ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ 143.7 స్కోర్ చేసారు. 2019-2024వరకు పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ ఏజెన్సీ ప్రకారం ఈ మెట్రిక్స్‌లో ఖచ్చితమైన స్కోర్ సాధించిన ఏకైక ఎంపీగా ఆర్ఆర్ఆర్ నిలిచారు. 
				  
	 
	వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సవాళ్లు ఉన్నప్పటికీ, రాజుగారి అసాధారణమైన పార్లమెంటరీ పనితీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన సేవ ఆయన నిబద్ధతను నొక్కి చెబుతుంది. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఈ జాబితాలో టీడీపీకి చెందిన జయదేవ్ గల్లా రెండో స్థానంలో ఉండగా, వంగగీత, రామ్మోహన్ నాయుడు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ పార్లమెంట్‌లో అంకితభావంతో పని చేయడం వల్ల ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపును నమోదు చేసుకున్నారని టాక్ వస్తోంది.