శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (12:55 IST)

అమరావతి కోసం పెన్షన్ డబ్బులలో సగం ఇచ్చేసిన పెన్షన్ దారుడు (Video)

pensioner
pensioner
అమరావతి రాజధాని అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో రాజధాని అమరావతిలో పడకేసిన వివిధ సంస్థల నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. 
 
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న పనుల్లో పురోగతి కనిపిస్తోంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఫోరెన్సిక్‌ ప్రయోగశాల పనులు ఊపందుకున్నాయి. 
 
ఇదే తరహాలో అమరావతిలో భూములు తీసుకున్న సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంకా అమరావతి రాజధాని అభివృద్ధి పనుల కోసం విరాళాలు వెల్లువల్లా వస్తున్నాయి. చిన్నాపెద్దా లేకుండా... సామాన్య ప్రజల నుంచి కోటీశ్వరుల వరకు అమరావతి కోసం విరాళాలు అందజేస్తున్నారు. 
 
ఈ క్రమంలో తన పెన్షన్ డబ్బులలో సగం రూ.3వేల రూపాయలను రాజధాని అభివృద్ధికి మంత్రి కందుల దుర్గేష్ చేతికి పెన్షన్ దారుడు అందజేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మంత్రి కందుల పెన్షన్ దారుడిని అభినందించారు.