శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (11:24 IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

Rains
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు, రైతులకు అలర్ట్‌ జారీ చేసింది ఐఎండీ. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదులుతుంది. ఈ ప్రభావంతో మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.
 
నవంబర్ 13 బుధవారం అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
అలాగే, కర్నూలు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని వివరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. చెరువులు, నదులు, రిజర్వాయర్ల చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.