శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2024 (08:20 IST)

నేడు నెల్లూరు - తిరుపతి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన!

chandrababu naidu
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో కొత్తగా 15 పరిశ్రమలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సంస్థలు ద్వారా రూ.900 కోట్ల మేరకు పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా 2740 మందికి ఉపాధి లభించింది. మరో 1213 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. 
 
కాగా, సోమవారం తిరుపతికి వచ్చే చంద్రబాబు నాయుడు... శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభిస్తారు. మరో 7 సంస్థలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆయా సంస్థల ద్వారా రూ.900 కోట్ల పెట్టుబడితో 2740 మందికి ఉపాధి లభించనుంది. మరో 1213 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. సోమవారం నాటి పర్యటనలో భాగంగా, శ్రీ సిటీ బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోవలతో సమావేశమవుతారు. 
 
అలాగే, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా ఆయన పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సోమశిల ప్రాజెక్టును సందర్శిస్తారు. సోమశిలలో వరదలకు దెబ్బతిన్న కట్ట పనులను పరిశీలిస్తారు.