శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2024 (15:42 IST)

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

pawan - babu
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం భేటీ అయ్యారు. విజయవాడ కలెక్టరేట్‌లో శనివారం వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ.కోటి చెక్కును చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ అందచేశారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి గారు పూజలు చేశారు. అలాగే, ఇరువురి నేతల మధ్య ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద ప్రభావిత పరిస్థితులపై చర్చ జరిగినట్టు సమాచారం.