గురువారం, 4 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 డిశెంబరు 2025 (15:37 IST)

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

pawan kalyan
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే గ్రామీణాభివృద్ధి శాఖ పని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన చిత్తూరు జిల్లా కేంద్రంలో డివిజనల్ అభివృద్ది అధికారి కార్యాలయాన్ని ప్రారంభించారు. అదే కార్యక్రమంలో వివిధ జిల్లాల్లోని 77 డీడీవో కార్యాలయాలకు పవన్‌ వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
 
'77 డీడీవో ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రజలకు సేవలందించడానికి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇవి ఉపయోగపడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు అందించాం. పంచాయతీరాజ్‌ వ్యవస్థ పటిష్టానికి ఐటీ వింగ్‌ ఏర్పాటు చేశాం' అని పవన్‌ అన్నారు. 
 
తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ 
 
రైలు ప్రయాణ తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ విధానంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తీసుకునే తత్కాల్ టిక్కెట్లకు కూడా వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. తత్కాల్ బుకింగ్‌లో అక్రమాలకు అరికట్టేందుకు ఈ నిబంధనను అమలు చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది. 
 
ఇందులోభాగంగా, గత నవంబరు 17వ తేదీ నుంచి ఎంపిక చేసిన రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ల వద్ద ఈ ఓటీపీ ఆధారిత తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. తొలుత కొన్ని రైళ్లతో మొదలుపెట్టి తర్వాత 52 రైళ్లకు విస్తరించింది. 
 
రాబోయే కొద్ది రోజుల్లో ఈ విధానాన్ని అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంటే ఇకపై కౌంటర్ వద్ద రిజర్వేషన్ ఫారమ్ నింపిన తర్వాత బుకింగ్ సమయంలో మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే టిక్కెట్ బుక్ అవుతుంది. తద్వారా అక్రమార్కులు, ఏజెంట్ల దందాను అరికట్టవచ్చన్నది రైల్వే శాఖ భావనగా ఉంది.