శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై పోలీసుల అమిత ప్రేమ... 60 రోజులవుతున్నా ఆచూకీ తెలియదు...

appolice
పల్నాడు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై పోలీసులు అమితమైన ప్రేమను చూపిస్తున్నారు. ఒక సీఐపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు. పోలింగ్ రోజు అల్లర్లకు సూత్రధారి కూడా. అయినప్పటికీ ఆయనపై పోలీసులు అమితమైన ప్రేమను చూపిస్తున్నారు. ఆయన గత 60 రోజులుగు కనిపించలేదు. మాచర్ల అల్లర్ల కేసుల్లో నిందితులైన పిన్నెల్లి వెంకట్రామి రెడ్డి, తురకా కిశోర్లను పోలీసులు పట్టుకోలేదు. 
 
కొత్తగా వచ్చిన ఎస్పీ అయినా హత్యాయత్నం కేసులున్న పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి జాడ కనిపెడతారని బాధితులు ఆశిస్తున్నారు. పోలింగ్ రోజు, మరుసటి రోజు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో పాటు ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ దాడులకు పాల్పడ్డారు. మాచర్లలో పోలింగ్ కేంద్రాల వద్ద హల్ చల్ చేశారు. మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీ పోలింగ్ కేంద్రంలో బీభత్సం చేశారు. కారుతో ఢీకొట్టి పది మందిని గాయపర్చారు. టీడీపీ నేత కేశవరెడ్డి ఇంటిపై దాడి చేసి ఇల్లు, కారు ధ్వంసం చేశారు. 
 
వెల్దుర్తి మండలం కుండ్లకుంటలో టీడీపీ ఏజెంట్ మాణిక్యరావుపై పిన్నెల్లి సోదరులిద్దరూ దాడి చేశారు. దీనిపై మంగళగిరి పోలీసుస్టేషన్ జీఆరో ఎఫ్ఎస్ఐఆర్ కింద 307 సెక్షన్ నమోదు చేశారు. తర్వాత అది వెల్దుర్తికి బదిలీ అయింది. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో సీఐపైనే దాడి చేశారు. ఈ ఘటనలో వెంకట్రామిరెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదైంది. ఇలా రెండు 307 కేసులున్నా ఇంతవరకూ పోలీసులు అతని జాడ కనిపెట్టలేక పోయారు. కొత్తగా వచ్చిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆ ఇద్దరినీ పట్టుకుంటారని బాధితులు ఆశిస్తున్నారు.