శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (16:45 IST)

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టు షాక్...

chennamaneni ramesh
తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్‌కు చెందిన వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. 
 
జర్మనీ పౌరుడుగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసే వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారని, తప్పుడు డాక్యుమెంట్లతో గత 15 యేళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ నష్టపరిహారాన్ని నెల లోపు చెల్లించాలని ఆదేసించింది. 
 
ఈ మొత్తంలో రూ.25 లక్షలు నగదును ప్రస్తుత ప్రభుత్వ విప్‌గా, వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న ఆది శ్రీనివాస్‌కు, రూ.5 లక్షలను లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస గతంలో చెన్నమనేనికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.