శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (16:42 IST)

రోజాకు మద్దతిచ్చిన సినీ నటి ఖుష్బూ.. ఆయన మాటలేంటి..?

Kushboo
సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ నగరి ఎమ్మెల్యే రోజాకు మద్దతిచ్చారు. టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణపై ఖుష్బూ విమర్శలు గుప్పించారు. 
 
ఒక మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రోజాకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణ చెప్పేదాకా సాగే పోరాటంలో తాను కూడా కలుస్తానని చెప్పారు. 
 
ఏపీ మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. ఆయన మాటలేంటి.. అంటూ ప్రశ్నించారు. జుగుప్సాకరమైన ఆయన వ్యాఖ్యలతో ఒక మనిషిగా ఆ వ్యక్తి విఫలమయ్యాడని ఫైర్ అయ్యారు. 
 
మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని మోదీ తీసుకొచ్చారని, మరోవైపు మహిళా సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వ్యక్తులు మహిళా నేతలను ఉద్దేశించి దారుణంగా మాట్లాడటం ఆవేదన కలిగించే అంశమని ఖుష్బూ వెల్లడించారు.