శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 నవంబరు 2024 (11:31 IST)

వర్రా రవీంద్రా రెడ్డికి ప్రాణహాని వుంది.. అంతా వైకాపా డ్రామా.. బీటెక్ రవి (video)

BTech Ravi
BTech Ravi
వైకాపా సోషల్ మీడియా సైకో కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డిని ఏపీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. శుక్రవారం ఆంధ్రా  తెలంగాణ రాష్ట్రాల ప్రాంతాలైన కర్నూలు - మహబూబ్ నగర్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో వర్రా రవీంద్రా రెడ్డికి ప్రాణహాని వుందని బీటెక్ రవి అన్నారు. వర్రా విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతోందని బీటెక్ రవి అన్నారు. వైసీపీ సోషల్ మీడియా వాళ్లే లీకులు ఇస్తూ అరెస్టు చేయించారని.. ఆపై తప్పించుకున్నాడని పోస్టులు చేస్తున్నారని బీటెక్ రవి తెలిపారు. అతనికి ప్రాణహాని కలిగించి ఆ నెపాన్ని ఏపీ పోలీసులు, టీడీపీ కూటమిలపై వేయాలని చూస్తున్నారని వెల్లడించారు. 
 
వర్రా రవీంద్రా రెడ్డి అరెస్టుకు సంబంధించిన ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేయాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. గతంలో వివేకా హత్య కేసులో కూడా అతను కీలకంగా ఉన్నారనే విషయాన్ని బీటెక్ రవి గుర్తు చేశారు.