శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (23:37 IST)

తిరుమలలో దువ్వాడ-దివ్వెల రీల్స్.. కేసు నమోదు చేసిన పోలీసులు

duvvada - madhuri
తిరుమలకు వచ్చిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఫొటో‌షూట్ చేయించుకున్నారని తెలిసింది. ఇలాంటివి కొండపై నిషేధం. స్వామి వారి సన్నిధిలో.. భక్తి మాత్రమే ఉండాలి. ఎక్స్‌ట్రాలు ఏవీ ఉండకూడదు. కానీ వీరిద్దరూ కలిసి.. హాయిగా పోజులిస్తూ ఫొటోషూట్ చేయించుకున్నారనే వివాదం తెరపైకి వచ్చింది. 
 
దివ్వెల మాధురి తిరుమాఢ వీధుల్లో, పుష్కరిణి దగ్గర ఫొటోలు తీయించుకోవడం చర్చకు దారితీసింది. ఇలాంటివి కొండపై చెయ్యకూడదు అని చెప్పాల్సిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. అది మానేసి, తనే దగ్గరుండి మాధురిని ఫొటోలు తీయించారని టాక్ వినిపిస్తోంది. 
 
ఈ వివాదంపై తిరుమల పోలీసులు స్పందించారు. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది.

పవిత్రమైన తిరుమాడ వీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేశారని ఆరోపణలున్నాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బీఎన్ఎస్ 292,296, 300 సెక్షన్ 66 -200-2008 కింద కేసు నమోదైందని పోలీసులు వెల్లడించారు.