గురువారం, 24 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 ఏప్రియల్ 2025 (11:14 IST)

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

Tirumala
జమ్మూకాశ్మీర్లో పర్యటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రత సిబ్బంది అలర్ట్ చేసింది. అనుమానితులను విచారిస్తూ, వారి వివరాలను సేకరిస్తోంది సెక్యూరిటీ సిబ్బంది. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోను పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసింది సెక్యూరిటీ సిబ్బంది. 
 
ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది. అనుమానితులను విచారిస్తూ, వారి వివరాలను సెక్యూరిటీ సిబ్బంది సేకరిస్తోంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాలలోనూ భద్రతను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.