శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 21 మార్చి 2024 (20:43 IST)

చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు: తిరుమలేశుని ఆశీర్వాదం, ఒకరోజు అన్నదానం

Devansh Birthday
కర్టెసి-ట్విట్టర్
చంద్రబాబు నాయుడు మనవడు- నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి వెళ్లారు. తన మనవడిని తిరుమలేశుని ఆశీర్వాదం కోసం తీసుకుని వెళ్లినట్లు శ్రీమతి నారా భువనేశ్వరి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసారు.
 
ట్విట్టర్లో ఆమె ఇలా పేర్కొన్నారు... ''ఈరోజు మా మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా వేంకటేశ్వరుని ఆశీర్వాదం తీసుకునేందుకు తిరుమల వెళ్ళాం. దేవాన్ష్ పేరిట తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్నదానానికి అవసరమైన మొత్తాన్ని విరాళంగా ఇచ్చాం. కుటుంబసభ్యులతో కలిసి భక్తులకు అల్పాహారం వడ్డించి,  అన్నప్రసాదాన్ని స్వీకరించడం ఎంతో సంతృప్తినిచ్చింది.''