శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జూన్ 2024 (12:29 IST)

పవన్ వారాహి పూజ చేస్తుండగా బూట్లతో లోపలికి వెళ్లిన సీఐ..

pawan kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో మంగళగిరి టౌన్ సీఐ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తించారు. అపాయింట్ మెంట్ లేకున్నా నేరుగా లోపలికి వచ్చారు. 
 
పవన్ వారాహి పూజ చేస్తుండగా బూట్లతో లోపలికి వెళ్లిన సీఐ.. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో త్రిపురాంతకం సీఐ వినోద్‌కుమార్‌ను మంగళగిరి టౌన్ సీఐగా నియమిస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. 
 
కాగా, సీఐ శ్రీనివాసరావు గతంలోనూ ఇలాగే దురుసుగా వ్యవహరించారని, జనసేన ఆఫీసులో పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్ మెంట్‌లో తనిఖీల పేరుతో హడావుడి చేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.