శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఆ ముగ్గురు నుంచి ప్రాణాలకు ముప్పు.. హోం మంత్రికి మదన్ మోహన్ ఫిర్యాదు!!

Madan
ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మాజీ ప్రభుత్వ అడ్వకేట్ పోతిరెడ్డి సుభాష్ రెడ్డిల నుంచి తనకు ప్రాణహాని వుందని, అందువల్ల తనకు రక్షణ కల్పించాలంటూ కె.శాంతి భర్త ఏపీ హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన స్వయంగా హోంమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను, తన పిల్లల్ని కాపాడుకోవడానికే మీడియా ముందుకు వచ్చానన్నారు. తన కుటుంబానికి న్యాయం చేయమని మంత్రిని కోరినట్లు చెప్పారు. నాలుగు రోజులుగా జరుగుతున్న అంశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తనతో చెప్పారన్నారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని మేడం గ్యారెంటీ ఇచ్చారన్నారు. ఓ సమయంలో ఎమోషనల్ అయి మేడం వద్దనే తాను ఏడ్చానని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు.
 
తాను అమెరికాలో ఉన్నప్పుడు ఝాన్సీని తన బిడ్డగానే తన భార్య శాంతి చెప్పిందన్నారు. దీంతో ఆ బిడ్డతో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యానన్నారు. తనను నయవంచనకు గురి చేశారన్నారు. ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నట్లు మొదట చెప్పిందని, ఆ తర్వాత మాటలు మార్చిందన్నారు. పూర్తిగా ఆరా తీయడంతో అసలు విషయం చెప్పిందన్నారు. ఏ భర్త కూడా బయటకు వచ్చి తన భార్యపై అపనింద వేయరని గుర్తుంచుకోవాలన్నారు.