శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2024 (19:14 IST)

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

Aswathi Thirunal Gowri Lakshmi Bayi
ఆంధ్ర సారస్వత పరిషత్, మన్సాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని విశాఖపట్నంలో ఈ నెల 24వ తేదీన ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని డా.వై.ఎస్.ఆర్.మూర్తి ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుండి నిర్వహించనున్నట్లు పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, మాన్సాస్ కార్యదర్శి డా.కె.వి.లక్ష్మీపతి రాజులు వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ట్రావన్‌కోర్ మహారాణి, కవయిత్రి, పద్మశ్రీ డా.అశ్వతి తిరుణల్ గౌరీ లక్ష్మీబాయికి డా.పి.వి.జి రాజు ఆధ్యాత్మిక పురస్కార ప్రదానం చేయనున్నట్లు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారాణసి, శ్రీ కాశీ విశ్వనాథ్ దేవాలయ ట్రస్టీ డా.బ్రిజ్ భూషణ్ ఓఝా, గౌరవ అతిథులుగా పూర్వ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తులు జస్టిస్.డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు, సభాధ్యక్షులుగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్‌లు పాల్గొంటారని ఆంధ్ర సారస్వత పరిషత్ మూడో ప్రపంచ తెలుగు మహా సభల ముఖ్య సంచాలకులు శ్రీ పి.రామచంద్రరాజు, పరిషత్ కార్యదర్శి శ్రీ రెడ్డప్ప ధవేజి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.