శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (12:35 IST)

తణుకు అన్న క్యాంటీన్‌.. భారీగా క్యూ కట్టిన జనం (వీడియో)

Tanuku
Tanuku
తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల క్లీనింగ్ అశుభ్రత అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలే అని అన్నారు. విషప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్‌ ఈ పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీశారన్నారు. 
 
కాగా.. తణుకు అన్న క్యాంటీన్లో మురికి నీటితో ప్లేట్లను శుభ్రం చేస్తున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. మురికి నీటితోనే శుభ్రం చేసి.. అందులోనే భోజనాన్ని వడ్డిస్తున్నారంటూ ఓ వ్యక్తి చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది. ఈ వీడియో ఫేక్ అని జరిగింది అది కాదని నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. 
 
ఇంకా తణుకు అన్న క్యాంటీన్‌పై పేద ప్రజలు పూర్తిగా ఆధారపడుతున్నారని నారా లోకేష్ అన్నారు. ఇంకా తణుకు క్యాంటీన్‌కు భారీగా పేద ప్రజలు చేరుకునే ఐదు రూపాయలకు లభించే ఆహారాన్ని తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.