శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2024 (11:36 IST)

టెక్కీపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం

gang rape
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ఓ టెక్కీపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలోని ఆర్సీ పురంలో ఐటీ ఉద్యోగిని ఆటో ఎక్కింది. 
 
అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఆటో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఆమెపై ఆటో డ్రైవర్ తో పాటు, మరో యువకుడు ఆటోలోనే అత్యాచారం చేశారు. 
 
అనంతరం ఆమెను మసీద్ బండ వద్దే వదిలేసి పోయారు. తనపై జరిగిన అఘాయిత్యంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.