మంగళవారం, 11 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 11 మార్చి 2025 (17:35 IST)

కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేక వరద బాధితులకు కోటి రూపాయలు నేనే ఖర్చు పెట్టా: బొత్స

botsa sattibabu
విజయవాడ బుడమేరు వరద బాధితుల పరిహారంపై శాసన మండలిలో హోంమంత్రి అనిత వైసిపిని ఉద్దేశిస్తూ... వరద బాధితులకు రూ. కోటి సాయం అదిస్తామని ఆనాడు జగన్ ప్రకటించారనీ, ఐతే ఆ కోటి రూపాయలు ఇంతవరకూ వరద బాధితుల నిధికి రాలేదన్నారు. ఆ డబ్బు ఏమైందో తెలియదని చెప్పారు. ఈ ప్రశ్నపై బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు.
 
కూటమి ప్రభుత్వంపైన తమకు నమ్మకం లేదన్నారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సాయం ఏమేరకు అందిందో అక్కడి ప్రజలను అడిగితే తెలుస్తుందని అన్నారు. తాము ఇచ్చే సాయాన్ని కూడా మాయం చేస్తారని జగన్ ఇచ్చిన కోటి రూపాయల మొత్తానికి బాధ్యత నేనే తీసుకున్నానని చెప్పారు. ఆ కోటి రూపాయలతో బాధితులకు పాలు, నీళ్లు, నిత్యావసరాలు కొనుగోలు చేసి ఇచ్చినట్లు చెప్పారు.
 
బొత్స ఇచ్చిన సమాధానంపై కూటమి నాయకులు ఛలోక్తులు విసిరారు. ఐతే కోటి రూపాయలు మొత్తం అలా నీళ్ల రూపంలో స్వాహా చేసారా అంటూ సెటైర్లు వేసారు.