గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 22 నవంబరు 2024 (12:45 IST)

ప్రభాస్‌తో నాకు రిలేషన్ వున్నట్లు సైతాన్ సైన్యం చేత జగన్ ప్రచారం చేయించారు: షర్మిల

YS Sharmila
నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభాస్ అనే వ్యక్తిని ఈరోజు వరకూ నేను చూడలేదు అంటూ చెప్పారు వైఎస్ షర్మిల. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... ప్రభాస్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, అతడెవరో నాకు తెలియదు.
 
జగన్ మోహన్ రెడ్డి గారే ఆయన తన సైతాన్ సైన్యంతో ప్రభాస్ తో నాకు సంబంధం వుందంటూ తప్పుడు ప్రచారం చేయించారు. నాకు క్యారెక్టర్ లేనట్లుగా దుష్ర్పచారం చేయించాడు. చెల్లెలిపై ప్రేమ వుంటే ఇలాగేనా వుండేది, సిగ్గుండాలి కదా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.