శుక్రవారం, 3 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (09:52 IST)

Jagan: అది ఇస్తారా.. నేను అసెంబ్లీకి వస్తాను.. కండిషన్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి

jagan
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 30 వరకు జరగనున్నాయి. 20, 21, 28 తేదీల్లో సెలవు ఉండనుంది. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని నిర్ణయించారు. సభలో చర్చించేందుకు 18 అంశాలను తెదేపా, 9 అంశాలను భాజపా ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు జీరో అవర్‌లోనూ మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
 
వైసీపీ శాసనససభా పక్ష భేటీలో వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా.. అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఎమ్మెల్యేలతో చెప్పారు. కానీ ఆయన అసెంబ్లీకి రావాలంటే ఓ కండిషన్ పెట్టారు. సభలో తగినంత టైమ్‌ ఇస్తే రేపటి నుంచే సభకు వస్తానని చెప్పారు. 
 
ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు కొన్ని నిమిషాలు ఇస్తే తాను ఏం మాట్లాడాలని వైఎస్ జగన్ అన్నారు. ప్రజా సమస్యలు వివరంగా చెప్పాలంటే టైమ్ ఇవ్వాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని అడిగారు. వైసీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ దగ్గరకి వెళ్లి ఈ విషయాన్ని చెప్పమని అన్నారు.