శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2024 (21:50 IST)

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

manchu manoj
సినీ నటుడు మంచు మనోజ్ జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతుంది. దీనికితోడు ఆయన సోమవారం తన భార్యాపిల్లలతో కలిసి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు వెళ్ళి తన అత్త మామల సమాధులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన కుమార్తె దేవసేన శోభను ఆళ్లగడ్డకు తొలిసారి తీసుకొచ్చినట్టు చెప్పారు. తన కోసం రాయలసీమ ప్రాంతం నుంచి అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. అలాగే, జనసేనలో చేరబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై ప్రస్తుతానికి ఏమీ మాట్లాడనేనని చెప్పారు. 
 
నిజానికి మంచు మనోజ్ తన సతీమణి భూమా మౌనికా రెడ్డితో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారని, ఆయన నంద్యాల నుంచి పోటీ చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతుంది. పైగా, వీరిద్దరూ జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ ప్రచారాన్ని ఆ దంపతులిద్దరూ ఎక్కడా ఖండించలేదు. సోమవారం కూడా మంచు మనోజ్ కూడా జనసేనలో చేరడం లేదని స్పష్టంగా కూడా చెప్పలేదు. ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని మాత్రమే చెప్పారు.