శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జులై 2024 (09:17 IST)

ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు.. మోహిత్ రెడ్డి అరెస్ట్

Mohit Reddy
Mohit Reddy
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు, మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి, తుడా మాజీ చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్టయ్యారు. 
 
తండ్రి భాస్కరరెడ్డి, తమ్ముడు హర్షిత్‌తో కలసి దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా శనివారం రాత్రి బెంగళూరు దేవనహళ్లి ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల్లో చంద్రగిరి పులివర్తి నానిపై కౌంటింగ్‌ కేంద్రమైన తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద హత్యాయత్నం జరిగింది. 
 
దీనిపై ఈసీ తీవ్రంగా స్పందించి దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దుబాయ్‌ పారిపోయేందుకు ప్రయత్నించి దొరికిపోయునట్లు ప్రచారం జరుగుతోంది.
 
అయితే మోహిత్‌ తన స్నేహితుడి పెళ్లికి హాజరయ్యేందుకు దుబాయ్‌ వెళ్లాలనుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు.