శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2024 (15:07 IST)

దేవాన్ష్ ప్రపంచ రికార్డు : మనవడిపై సీఎం బాబు ప్రశంసలు

devansh nara
ఏపీ విద్యా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఏకైక కుమారుడు నారా దేవాన్ష్ చిన్నవయసులోనే ప్రపంచ రికార్డును నెలకొల్పారు. చదరంగం ఆటంలో అత్యంత వేగంగా పావులు కదిపే ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్‌ను అతి సునాయాసంగా సాధించాడు. దీంతో ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)లో స్థానం దక్కించుకున్నాడు. తొమ్మిదేళ్ల చిన్న వయసులోనే మనవడు సాధించిన ఘనత పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వెల్ డన్ దేవాన్ష్ అంటూ మనవడిని మనస్ఫూర్తిగా అభినందించారు.
 
'175 పజిల్స్‌ను పరిష్కరించి ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ సాధించడమేకాకుండా వరల్డ్ రికార్డు నెలకొల్పినందుకు కంగ్రాచ్యులేషన్స్. అంకితభావం, కఠోర శ్రమ, పట్టుదల... ఇవే విజయానికి సూత్రాలు. ఈ ఘనతను సాధించడానికి నువ్వు గత కొన్ని నెలలుగా ఎంతో శ్రద్ధగా సాధన చేశావు. నువ్వు సాధించిన వరల్డ్ రికార్డు పట్ల గర్విస్తున్నాను నా లిటిల్ గ్రాండ్ మాస్టర్' అంటూ చంద్రబాబు మనవడిపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే, తన కోడలు నారా బ్రాహ్మణి షేర్ చేసిన వీడియోను కూడా చంద్రబాబు తన ట్వీట్‌లో పొందుపరిచారు.