బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి
రోడ్డు ప్రమాదంలో నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. ఆనందకరమైన కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఆ వధువు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. సోమవారం నాడు ట్రాక్టర్ బైక్‌ను వెనుక నుండి ఢీకొట్టడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు ప్రణతి మరణించింది.
వివరాల్లోకి వెళితే.. మిరుదొడ్డి మండలం చేప్యాల గ్రామానికి చెందిన సాయికుమార్, ప్రణతి దంపతులు హైదరాబాద్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రణతి అక్కడికక్కడే మరణించగా, సాయికుమార్ గాయపడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం దంపతుల కొత్త ప్రయాణాన్ని విషాదంగా మార్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.