బుధవారం, 12 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 8 మార్చి 2025 (13:04 IST)

విశాఖపట్టణంలో ఎన్నారై టెక్కీ అనుమానాస్పద మృతి!!

deadbody
విశాఖపట్టణం నగరంలో ఓ ప్రవాస భారతీయురాలైన సాఫ్ట్‌వేర్ మహిళా ఇంజనీర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె పేరు రోజా. అమెరికాలో టెక్కీగా పని చేస్తున్నారు. తన మిత్రుడు శ్రీధర్‌‍ను కలిసేందుకు ఆమె అమెరికా నుంచి విశాఖపట్టణానికి వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో బస చేసిన ఆమె.. స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో శ్రీధర్ ఈ విషయాన్ని పోలీసులకు ఫోను ద్వారా తెలియజేశారు. 
 
అయితే, ఈ వ్యవహారంలో పలు అనుమానాలు ఉన్నప్పటికీ ప్రాథమికంగా మాత్రం పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసినట్టు వైజాగ్ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. అలాగే, మహిళా టెక్కి స్నేహితుడు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. 

యువకుడికి బడితపూజ చేసిన వృద్ధుడు .. ఎందుకో తెలుసా? 
 
ఇటీవలికాలంలో రీల్స్ చేయడం పెరిగిపోయింది. ఫోన్ చేతిలో ఉంటే చాలు.. యువత రీల్స్ షూట్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. కొన్నిసార్లు రీల్స్ చిత్రీకరణలో ప్రాణాలు పోగొట్టుకోవడం, కొన్ని రీల్స్ వికటించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ కుర్రోడు రీల్ షూట్ చేసే ప్రయత్నంలో బడిత పూజ చేయించుకున్నాడు. 
 
ఇంతకీ ఏం జరిగిందో పరిశీలిద్దాం... ఓ కుర్రాడు, ఓ అమ్మాయి పక్కన నిల్చుని టీజ్ చేస్తున్నట్టుగా నటించాడు. ఇదంతా రీల్స్‌లో భాగమే. కానీ, అదే సమయంలో కారులో అటుగా వచ్చిన ఓ వృద్ధ దంపతులు ఆ అబ్బాయి నిజంగానే అమ్మాయిని ఏడిపిస్తున్నాడని భావించి ఆగ్రహానికి గురయ్యారు. 
 
వెంటనే ఆ పెద్దాయన కారు దిగి, తన కారులో నుంచి ఓ కర్ర తీసుకుని కుర్రాడుని చితకబాదాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఉతికారేశాడు. దీంతో కుర్రాడికి ఆ వృద్ధుడు బడిత పూజ చేయడమే ఓ రీల్ అయింది. చుట్టూ ఉన్న వాళ్లు తమ సెల్ ఫోనులో ఈ తతంగాన్ని వీడియో తీశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.