శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 4 జులై 2024 (15:46 IST)

మరొక్కసారి చెబుతున్నా, మేము మంచి చేసి ఓడిపోయాము, చంద్రబాబుకి వార్నింగ్: వైఎస్ జగన్

Jaganmohan Reddy
నెల్లూరు సెంట్రల్ జైలులో వున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. " రాష్ట్రంలో బుల్డోజర్లు పెట్టి దాడులు చేస్తున్నారు. మీరు చేసే పని మంచిది కాదు చంద్రబాబు గారు. మీరు విత్తనం నాటితే అది వృక్షమవుతుంది. మీరు నిరంతరం పాలకులుగా వుండరు. అది తెలుసుకోండి.
 
మేము మంచి చేసి ఓడిపోయాము. కాస్తో కూస్తో 10 శాతం మంది మీ హామీలు చూసి మోసపోయారు. మీరు ఇలాగే చేస్తే ప్రజలు మీకు బుద్ధి చెబుతారు. మంచి చేయండి లేకపోతే మీకు తగిన శాస్తి జరుగుతుంది. చంద్రబాబును ఈ విషయంలో నేను హెచ్చరిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చారు.