శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (22:56 IST)

సిద్ధం సిద్ధం అని చావగొట్టేస్తున్నారు, మేం యుద్ధం అంటాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan at Bhimavaram meeting
కర్టెసి-ట్విట్టర్
భీమవరం జనసేన పార్టీ సమావేశంలో పవన్ కల్యాణ్ కార్యకర్తలు, నాయకులనుద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లోనే... సిద్ధం సిద్ధం అని చావగొట్టేస్తున్నారు, మేం యుద్ధం అంటాం. సినిమాల్లో చెప్పడానికి కూడా సిగ్గుపడతాను. పంచ్ డైలాగులు సినిమాల్లోనే. నిజ జీవితంలో పబ్లిక్ పాలసీలపై మాట్లాడుతా.
 
బీజేపిలో నాకు తెలిసిన నాయకులు మోదీగారు. మోదీగారు ప్రధానమంత్రి కాకముందు వచ్చినవాడిని, ఆయన దేశానికి ధృవతార. నేను మోదీగారి వెంట నడిస్తే నన్ను నానా మాటలు అన్నారు. ఐతే ఇప్పుడు దేశం మొత్తం పొగడ్తలు కురిపిస్తున్నారు. నేను నాయకుడిని నమ్మితే నిజాయితీగా నడుస్తాను.
 
టీడిపి-జనసేన-భాజపా కూటమి గెలుస్తుంది. ఈ ఎన్నికలు అయిపోతే జగన్ గుర్తు కూడా వుండడు. వివిధ కులాల మధ్య విభేదాలు సృష్టించడమే జగన్ విష సంస్కృతి. జగన్ కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు, అదే అతనికి తిరిగి వచ్చింది. తండ్రి వైఎస్సార్ కోట్లు సంపాదించి పెట్టారు. కానీ సోదరికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వడు. సాక్షి ఆస్తుల్లో వాటా రావాలి, ఇవ్వలేదు. సొంత చెల్లెలికే ఆస్తులు పంచి ఇవ్వనివాడు ఇక మనకేమి ఇస్తాడు. భీమవరం వైసిపి నాయకులతో నాకు వ్యక్తిగతంగా బేధాలు లేవు.

నేను రెండు చోట్ల ఓడిపోయాను. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీని వదిలి పారిపోయాడు. ఐనా ధైర్యంగా పార్టీని నడిపిస్తూ వస్తున్నాను. పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ కూటమికి అత్యధిక సీట్లు వస్తాయని అంటున్నారంటే అందులో జనసేన బలం వుందని గట్టిగా చెప్పగలను అని అన్నారు పవన్ కల్యాణ్.