శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మే 2024 (15:36 IST)

భార్యతో ఆ మాటే చెప్పాను.. పవన్‌కు ప్రభాస్ పెద్దమ్మ మద్దతు

pawan kalyan
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ, తనను తిట్టారని, తన భార్యాబిడ్డలను కూడా తిట్టారని, అవమానించారని, కానీ ప్రజల కోసం అన్నింటినీ భరించానని స్పష్టం చేశారు. 
 
వచ్చే ముందు నా భార్యకు ఒకటే మాట చెప్పాను... ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని త్యాగం చేయాలనేది విదుర నీతి. ఈ రాష్ట్రం కోసం మన కుటుంబాన్ని నష్టపోయినా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందాం అని నా భార్యకు చెప్పాను" అని వివరించారు.
 
ఏపీ దశ దిశ మార్చేందుకు పిఠాపురం వచ్చాను. పిఠాపురం నుంచే మొదలుపెడతా. దేశం గర్వించేలా పిఠాపురం నుంచే మార్పుకు శ్రీకారం చుడతా. నేను పనిచేస్తోంది ప్రజల కోసం, యువత కోసం. ఒక తరం కోసం పోరాడుతున్నాను, రెండు తరాల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాను. 
 
మరోవైపు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా స్టార్ హీరో ప్రభాస్ పెద్దమ్మ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ.. పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో మన పవన్ కల్యాణ్ గెలుపు ఖాయం అయిపోయిందన్నారు.