1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఏప్రియల్ 2025 (13:58 IST)

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

Prakash Raj
ప్రజాసమస్యలపై దృష్టిసారించకుండా టైంపాస్ పనులేంటి అంటూ జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై సినీ నటుడు ప్రకాష్ ప్రశ్నించారు. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన పవన్.. ఇపుడు అధికారంలోకి వచ్చాక వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదనే భావన ప్రజల్లో వచ్చిందన్నారు. అధికారంలో ఉండి కూడా ప్రజా సమస్యల పరిష్కారించకుండా టైంపాస్ పనులేంటి అని నిలదీశారు. రకరకాలుగా మాట్లాడటానికి ఇదేం సినిమా కాదన్నారు. 
 
ఇక తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ వివాదంపై మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఇది చాలా సున్నితమైన అంశమన్నారు. ఇలాంటి వాటి గురించి మాట్లాడేటపుడు సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒకవేళ నిజంగా లడ్డూ తయారీలో కల్తీ జరిగివుంటే, బాధ్యులను తక్షణ శిక్షించాలని తెలిపారు. అలాగే, తాను సనాత ధర్మానికి వ్యతిరేకిని కాదన్నారు.