యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)
ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ రాజకీయ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ తన భార్యతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి, వారికి మంచి దర్శనం కల్పించారు. ఆ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ విజయ్‌ని కలిశారు. తన టీవీకే పార్టీతో కలిసి పనిచేస్తానని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. అయితే, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పీకే విజయ్‌కు మద్దతు ఇవ్వడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బీహార్‌లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లో ఆయన పార్టీ ఇప్పటికే పోటీ చేసింది. మంగళవారం రాత్రే ఆయన చెన్నై నుంచి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. ఈ తెల్లవారు జామున శ్రీవారి సేవలో పాల్గొన్నారు.