శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 అక్టోబరు 2024 (18:49 IST)

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

pawan kalyan
'పురచ్చి తలైవర్', తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజిఆర్ గారి పట్ల తనకు ఎంతో ప్రేమ, అభిమానం వున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. చెన్నైలో తను చదువుకునేటప్పుడు అది అంతర్భాగంగా ఉంది. అది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. రాబోయే ‘AIADMK’ 53వ ఆవిర్భావ దినోత్సవం ‘OCT 17న’ ‘పురచ్చి తలైవర్’ ఆరాధకులు, అభిమానులందరికీ నా శుభాకాంక్షలు అంటూ పవన్ ట్వీట్ చేసారు.
 
ట్వీట్లో పేర్కొంటూ... పురచ్చి తలైవర్‌తో నాకు మొదటి పరిచయం మైలాపూర్‌లో చదువుతున్నప్పుడు మా తమిళ భాషా ఉపాధ్యాయుడి ద్వారా జరిగింది. ఆయన 'తిరుక్కరల్' నుండి ఒక ద్విపదను చదివి వినిపించారు. ఆ తిరుక్కురల్‌లో పురచ్చి తలైవర్ లక్షణాలు ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.
 
పరోపకారము, దయాగుణము, నిష్కపటము, ప్రజలపట్ల శ్రద్ధ ఈ నాలుగు విషయములను కలిగియున్న పాలనాదక్షులకు ఆయన వెలుగు.