శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (11:47 IST)

పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ.. అరెస్టు తప్పదా?

ramgopalvarma
అసభ్య దూషణలు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లను కించపరిచిన కేసులో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. విచారణకు హాజరయ్యేందుకు తనకు నాలుగు రోజుల సమయం కావాలంటూ కోరారు. ఈ మేరకు ఒంగోలు గ్రామీణ సీఐ శ్రీకాంత్‌ బాబుకు వర్మ వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేశారు. ప్రస్తుతం తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, విచారణకు రాలేను అంటూ మెసేజ్ చేశారు. దీంతో వర్మ నిజంగానే షూటింగులో ఉన్నారో లేదోనని ఆరా తీస్తున్నారు. 
 
సోషల్‌మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని రాంగోపాల్‌వర్మపై మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెల్సిందే. ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలని పోలీసుల నోటీసులు జారీ చేశారు. మరోవైపు, ఈ కేసు కొట్టివేయాలని హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్‌ దాఖలు చేయగా, అక్కడు చుక్కెదురైంది. దీంతో ఆయన చిక్కుల్లోపడ్డారు. ఈ వివాదం నుంచి గట్టెక్కేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.