శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (14:11 IST)

అసభ్యకర పోస్టులు... వర్రా వాంగ్మూలం.. పెద్ద తలకాయలకు బిగుస్తున్న ఉచ్చు!!

varra ravindra reddy
సోషల్ మీడియా వేదికగా చేసుకుని వైకాపా సోషల్ మీడియా విభాగం కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డి పెట్టిన అసభ్యకర పోస్టులకు సంబంధించి పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతను ఇచ్చిన వాంగ్మూలంలో అనేక సంచలన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, వైకాపాకు చెందిన అనేక మంది పెద్ద తలకాయలకు ఇందులో పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. ఇలాంటి వారందరినీ గుర్తించి విచారణకు విచారణకు హాజరుకావాలంటూ సమన్లు పంపించేందుకు పోలీసులు యత్నాలు మొదలుపెట్టారు. 
 
రవీంద్రా రెడ్డి తన వాంగ్మూలంలో అసభ్యకర పోస్టుల వెనుక గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డితో పాటు వైకాపా అధినేత జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి కీలకంగా ఉన్నారని పేర్కొన్నారు. వీరితోపాటు మరో 60 మంది వరకు ఉన్నట్లు పేర్లతో వివరాలు అందించారు. 
 
జగన్ సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, జగన్ తల్లి, విజయమ్మ, దివంగత మాజీమంత్రి వివేకా కుమార్తె సునీతపై జుగుప్సాకరమైన పోస్టులు పెట్టడం వెనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన పీఏ రాఘవరెడ్డి హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో వర్రా తెలిపారు. ఇప్పటికే సజ్జలు భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలతో పాటు ఎంపీ పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
మరోవైపు వర్రా రవీందర్ రెడ్డి పేర్కొన్న మేరకు గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి, ఐడ్రీం యూట్యూబ్ ఛానల్ నడిపిన చిన్నా వాసుదేవ రెడ్డి, ఇంటూరి రవికిరణ్, ఎస్కే మస్లీ, పుట్టపు ఆదర్శలతో పాటు మరికొందరికి దర్యాప్తునకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయనున్నారు. అయితే ఎంపీ పీఏ రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రాఘవ రెడ్డి దొరికితే ఆయనిచ్చే వాంగ్మూలం ఆధారంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈలోపే పరిస్థితులను బట్టి ఆయనను విచారించే అవకాశం ఉంది.