శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 నవంబరు 2024 (22:30 IST)

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

ramgopalvarma
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనకు అరెస్టు భయం పట్టుకోవడంతో అజ్ఞాతంలోకి జారుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కనుగొనేందుకు ఆరు పోలీసు బృందాలు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. 
 
గత వైకాపా పాలనలో అధికార పార్టీ నేతల అండ చూసుకుని నోరు పారేసుకున్న వారిలో వర్మ ఒకరు. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులను వర్మ పెట్టారు. వీటిపై గత వైకాపా ప్రభుత్వంలోనే పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఇపుడు ప్రభుత్వం మారడంతో వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. 
 
అయితే, ఓ కేసులో విచారణకు రావాలంటూ ఒంగోలు పోలుసులు ఆయనకు స్వయంగా నోటీసులు అందజేసినప్పటికీ ఆయన హాజరుకాలేదు. అప్పటి నుంచి ఆయనకు అరెస్టు భయం పట్టుకుంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించారు. పైగా, అరెస్టు చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనే భయం పట్టుకుంది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 
 
మరోవైపు, వర్మ కోసం ఆరు పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, కర్నాటకలలో వర్మ ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌ ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది.